Raitula Nirasana:పురుగుల మందు డబ్బాతో రైతుల నిరసన

Raitulu Nirasana
Raitulu Nirasana

Raitula Nirasana: మల్లాపూర్, ఆగస్టు 17 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రుణమాఫీ కానీ రైతులతో వ్యవసాయ శాఖ, బ్యాంక్ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం రైతువేదికలో ఏర్పాటుచేసిన సమావేశం ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. సమావేశం రసాభాసగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతుల చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాలను లాగేసుకున్నారు. రుణమాఫీ కాని రైతులతో అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో రుణమాఫీ రాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం రైతుల ఆగ్రహంతో రసాభాసగా మారడంతో అధికారులు సమావేశం మధ్యలోనే వెనుతిరిగి వెళ్లిపోయారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now