September 15, 2024
Humanity Ground

Humanity: తల్లి అంత్యక్రియల కోసం బిక్షాటన

Humanity: నిర్మల్ జిల్లా, ఆగస్టు 18 (ప్రజా శంఖారావం): నిర్మల్ జిల్లాలో హృదయ విధాకర ఘటన చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియల కోసం ఓ చిన్నారి బిక్షాటన చేస్తున్న దృశ్యం హృదయాలను కలిచివేసింది. వివరాల్లోకి వెళితే.. తానూర్ మండలం బెల్దరోడ గ్రామానికి చెందిన గంగమణి (36) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు కొన్ని రోజుల క్రితం భర్త మృతి చెందాడు. తల్లిదండ్రులు లేని ఆ చిన్నారి ఒంటరిగా మిగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి చనిపోవడంతో ఆమె అంత్యక్రియల కోసం మనసున్న మారాజులు సాయం చేయాలంటూ చిన్నారి చేసిన భిక్షాటన గ్రామస్తులను కలచివేసింది. ఎవరికి తోచినవారు ఆర్థిక సాయం చేయడంతో అక్కడి వారి సహాయంతో ఆ చిన్నారి తల్లి అంతక్రియలను పూర్తి చేసింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *