Annadata Sukhibhava Scheme: ప్రభుత్వము రైతులకు ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. త్వరలో ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే ఈ పథకం ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఈ పథకం కింద రైతులకు రూ.14000 రూపాయలు లభిస్తాయి. త్వరలోనే అర్హత ఉన్న రైతులకు వారి బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేయబడతాయి. ఇటువంటి సమయంలో రైతులకు ప్రభుత్వము ఒక కీలక విషయం తెలిపింది. అర్హులైన వారిని గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే మొదలుపెట్టింది. అర్హుల పేర్లతో అధికారులు ఒక జాబితాను రూపొందించారు.
ఈ జాబితాలో మీ పేరు ఉంటే మీ ఖాతాలో త్వరలో డబ్బులు పడతాయి. ఒకవేళ ఈ జాబితాలో మీ పేరు లేకపోతే మీకు డబ్బులు రావు. రైతులు తమకు సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి తమ పొలం పట్టా బుక్తో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఉన్న అధికారిని సంప్రదిస్తే మీకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు వస్తాయో లేదో తెలుస్తుంది. వెంటనే నీకు సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్లి ఒకసారి చెక్ చేసుకోండి.
దీనికి సంబంధించి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ కడప జిల్లా తొర్రి వేముల లోని రైతు భరోసా కేంద్రం అధికారి తిరుమలేష్ మాట్లాడుతూ రైతులందరూ తమ పొలం పట్టా బుక్కుతో పాటు తమ ఆధార్ కార్డును తీసుకొని ఆర్ బి కే సెంటర్ కు వెళ్లినట్లు అయితే అక్కడ మీ వివరాలను చెక్ చేసి మీకు ఈ పథకానికి అర్హత ఉందా లేదా అనే దానిని తెలియజేస్తారు అని తెలిపారు. ఒకవేళ ఈ జాబితాలో మీ పేరు లేకపోతే ఎక్కడ పొరపాటు జరిగింది అనే దానిని కూడా అధికారులు వివరిస్తారు. అప్పుడు ఏం చేయాలో కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి వెంటనే రైతులందరూ సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్లి మీకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు వస్తాయో రావో తెలుసుకోవచ్చు.