Swapna Shastra: ప్రతి మనిషికి నిద్రపోతున్న సమయంలో ఏదో ఒక కల రావడం సహజం. పిల్లలు నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కూడా కలలు కనడం సర్వసాధారణం అని చెప్పొచ్చు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే కలలు భవిష్యత్తు గురించి మంచి లేదా చెడు సంకేతాలను తెలియజేస్తాయని నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల కలలు భవిష్యత్తులో మంచి సంకేతాలను సూచిస్తే మరికొన్ని రకాల కలలు చెడు సంకేతాలను సూచిస్తాయట. కొంతమందికి తమ కలలో తాము ఊడుస్తున్నట్లు కనిపిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కళకు అర్థం ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.
కలలో కనిపించే ప్రతి సంఘటన కూడా భవిష్యత్తులో జరిగే శుభ పరిణామాలకు లేదా అశుభ పరిణామాలకు సంబంధించినదిగా ఉంటుంది. కొంతమంది తమ నిద్రపోతున్న సమయంలో ఊడుస్తున్నట్లు కలలు కంటారు. ఒకవేళ మీకు కలలో మీరు ఊడుస్తున్నట్లు కనిపించినట్లయితే దాని అర్థం భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడవచ్చు. మీ కృషికి అలాగే మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలను త్వరలోనే పొందుతారు అని ఈ కల సూచిస్తుంది.
త్వరలో మీరు భవిష్యత్తులో ఆర్థిక లాభం కూడా పొందుతారు అని అలాగే మీ చేతికి రాకుండా ఇబ్బంది పడుతున్న డబ్బులు త్వరలో తిరిగి పొందుతారు అని స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కల సూచిస్తుంది. మీకు వచ్చిన కలలో మీరు ఊడ్చుతున్నట్లు కనిపించడం అనేది మీ చుట్టుపక్కల ఉన్న ప్రతికూల శక్తులను అలాగే ప్రతికూల వాతావరణాన్ని మీరు వదిలించుకోవడానికి సంకేతంగా పరిగణిస్తారు. దీని అర్థం ఏంటంటే మీరు మీ జీవితంలో ఇకపై సానుకూల మార్పులను పొందబోతున్నారు అని అర్థం. ఇది కొత్త ప్రారంభం వైపు మీరు అడుగులు వేయడాన్ని కూడా సూచిస్తుంది. మీరు ఏదైనా కొత్త పని లేదా కొత్త సంబంధం, కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు అని అర్థం.