School: మెట్ పల్లి, ఆగస్టు 09 (ప్రజా శంఖారావం): మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోయింది. పది రోజుల క్రితమే ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన ఘటన మరవకముందే మళ్ళీ అదే పాఠశాలలో కలకలం రేగింది.
శుక్రవారం తెల్లవారుజామున 6వ తరగతికి చెందిన 3గ్గురు విద్యార్థులకు అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగించింది. తెల్లవారుజామున 3 గంటలకు ఓ విద్యార్థిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే విద్యార్థి చనిపోవడం మళ్ళీ జిల్లా వ్యాప్తంగా సంచలన రేపుతుంది. మరో ఇద్దరు విద్యార్థులలో ఒకరిని నిజామబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, మరో విద్యార్థికి స్థానిక మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన విద్యార్థి అనిరుధ్ సిరిసిల్ల మండలం ఎల్లారెడ్డి పెట్ గ్రామట్ పల్లి మండలం ఆత్మకూరు గ్రామం కాగా, ఇంకొకరు హేమంత్ యాదవ్ మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులుగా ఉన్నట్లు ప్రస్తుత సమాచారం.
మోక్షితమైన విద్యార్థిని నిజాంబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించడం హేమంత్ యాదవ్కు మెట్పల్లి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.