ACB Rides: నిజామాబాద్, ఆగస్టు 09 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున జరిగిన ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. స్థానిక జిల్లా కేంద్రంలోని మున్సిపల్ రెవెన్యూ అధికారి (ఆర్.ఓ.) నరేందర్ ఇంటి పై ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు.
ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నారన్న ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. తెల్లవారు జాము నుంచి అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఏసీబీ అధికారుల తనిఖీల్లో భారీగా నగదు, బంగారు అభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now