School Bus: మెట్ పల్లి/కోరుట్ల, మార్చి22 (ప్రజా శంఖారావం): కోరుట్ల పట్టణంలోని కృష్ణ టెంపుల్ వద్ద అదుపుతప్పి ప్రైవేట్ స్కూల్ బస్సు ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొనడంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులను తీసుకురావడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు బస్సులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మారుతీ కి స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now