Son attacked On His parents: మెట్ పల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా శంఖారావం): మెట్పల్లి పట్టణ కేంద్రంలో ఉదయ వికార ఘటన చోటుచేసుకుంది. కన్నా కొడుకే తల్లిదండ్రుల పాలిట యమపాశంగా మారాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పట్టణ కేంద్రంలోని బోయవాడకు చెందిన ఎల్ల అన్వేష్ గత కొంతకాలంగా మానసికస్థితి సరిగా లేక బాధపడుతున్నాడు. కడుపులో మోసి కనిపించిన కొడుకు ప్రయోజకుడై తమని పోషిస్తాడు అనుకుంటే మతిస్థిమితం కోల్పోయి యమపాశంగా మారి తల్లిదండ్రులపైనే కత్తితో, కొడవలితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి వెళ్లి చూడగా తల్లి రమాదేవి, తండ్రి గంగ నరసయ్య ల మతి స్థితిమితం లేని కొడుకు విచక్షణ రహితంగా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ చెప్పారు.
Son attacked On His Parents: కన్న కొడుకే తల్లిదండ్రులకు యమ పాశం
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now