SRSP: బాల్కొండ, ఆగస్టు 07 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీటి విడుదలకు అధికారులు బుధవారం నుండి ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో ఈ వానాకాలం పంటలకు నీటి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువల ద్వారా నీటిని విడుదలకు అధికారులు సిద్ధం చేశారు.
నేటి విడుదలను ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో జోన్ _1 పరిధిలో కాకతీయ కాలువ ద్వారా 7 రోజులు పాటు నీటి విడుదల చేయనున్నారు. జొన్ _2 పరిధిలో ఎల్.ఎం.డి వరకు 8 రోజుల పాటు నీటి విడుదలను అధికారులు చేయనున్నారు. దీంతో నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 7.56 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగుకు నీటి విడుదల దోహద పడనుంది. ప్రాజెక్టు ఆయకట్టు రైతులు నీటి విడుదల పట్ల ఆనంద వ్యక్తం చేస్తున్నారు.