SRSP Project Gates Open: నిజామాబాద్ జిల్లా, సెప్టెంబర్ 02 (ప్రజా శంఖారావం): ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు వరద పోటెత్తింది. రెండు రోజులగా కురుస్తున్న వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మంజీర నది పై గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి భారీగా ఇన్ ఫ్లో వస్తుండడంతో అధికారులు 40 వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువకు గోదావరి ఉరకలేస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో 40 వరద గేట్ల ద్వారా లక్ష 90వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాకతీయ ప్రధాన కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చూడడానికి పర్యాటకులు తరలి వస్తున్నారు. మరోవైపు మంజీర నదిలో సైతం వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.
SRSP Project Gates Open: ఎస్సారెస్పీ 40 గేట్లు ఎత్తిన అధికారులు
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now