Teenmar Mallanna: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలోనే ప్రజలలో నమ్మకం కోల్పోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న విధానమే కాంగ్రెస్ పార్టీ నాశనానికి కారణమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధ్వజమెత్తారు. పరోక్షంగా బిజెపి పార్టీకి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు, మల్కాజ్గిరి సిట్టింగ్ సీట్లలో కావాలనే కాంగ్రెస్ పార్టీని ఓడించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
రేవంత్ రెడ్డి చేసిన కులగణన సర్వే తప్పు అని తాను నిరూపిస్తానని, తనతో చర్చకు సిద్ధమా? అంటూ ఈ సందర్భంగా ఆయన సవాల్ చేశారు.