Temple: మెదక్ జిల్లా, ఆగస్టు 10 (ప్రజా శంఖారావం): మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని రెండు హుండీలను దొంగలించారు. గర్భగుడి ముందున్న రెండు ప్రధాన హుండీలను దొంగలు దొంగలించి ఆలయంలోని పాత కళ్యాణకట్ట వద్ద పడేశారు.
కానీ గత పది రోజుల క్రితమే ఆలయ ఎండోమెంట్ అధికారులు హుండీలోని డబ్బులు లెక్కించి ఖాతాలో జమ చేశారు. ఇదివరకు కూడా అమ్మవారి దేవాలయంలో దొంగతనానికి దుండగులు ప్రయత్నించి విఫలమయ్యారు.
కానీ అధికారులు దొంగలు పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అమ్మవారి ఆలయంలో పకడ్బందీగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, దొంగతనాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పటిష్టమైన సిసి ఫుటేజీ, బందోబస్తు ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now