Central Government: కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో ఉన్న రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7.75 కోట్లకు పైగా రైతులకు ఈ పథకంతో లాభం చేకూరనుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించేందుకు అవసరమైన నిధులను కూడా తాజాగా కేటాయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో వడ్డీ సబ్సిడీ పథకం కింద వడ్డీ సబ్సిడీ భాగాన్ని ప్రభుత్వం కొనసాగించాలని ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 7.75 కోట్ల రైతులు ఈ పథకంతో లాభ పడనున్నారు.
ఈ పథకానికి అవసరమైన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మే నెల 28న రిలీజ్ అయిన అధికారిక ప్రకటన ప్రకారం వడ్డీ సబ్సిడీ పథకం కింద రైతులకు వడ్డీ సబ్సిడీ భాగాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. వీటికి అవసరమైన నిధుల సమీకరణను కూడా ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని వడ్డీ సబ్సిడీ అంటారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు తీసుకునే రుణాలపై వడ్డీ భారం తగ్గేలాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేవలం ఏడు శాతం వార్షిక వడ్డీతో మూడు లక్షల వరకు చిన్న కాలిక వ్యవసాయ రుణాలను ఆమోదిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో 1.5% వడ్డీ సబ్సిడీని అర్హత ఉన్న రుణ సంస్థలకు ఇస్తుంది. అలాగే అనుకున్న సమయం కంటే ముందుగానే చెల్లించిన రైతులకు మూడు శాతం ప్రాంప్ట్ రీ పేమెంట్ ఇన్సెంటివ్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఈ క్రమంలో రైతులు చెల్లించవలసిన అసలు వడ్డీ రేటు నాలుగు శాతానికి తగ్గిపోతుంది. అలాగే ప్రాణి సంరక్షణ మరియు మత్స్య పాలన కింద రైతులు తీసుకునే రెండు లక్షల వరకు రుణాలు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది.