Home బిజినెస్ Todays Gold Rate: మహిళలకు భారీ శుభవార్త…2 రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు…తులం ఎంతంటే

Todays Gold Rate: మహిళలకు భారీ శుభవార్త…2 రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు…తులం ఎంతంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: పెళ్లిళ్ళు, శుభకార్యాల సీజన్లో మన దేశ మార్కెట్లో పసిడి మరియు వెండి కి బాగా డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో కొన్నిసార్లు వీటి ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర తులానికి లక్ష రూపాయలు దాటి ఆల్టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే లక్ష రూపాయలు దాటినా తులం బంగారం ధరలు ప్రస్తుతం బులియన్ మార్కెట్లో దిగి వస్తున్నాయి.

ఇటీవల తులం బంగారం ధర 95 వేలకు దిగి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ 98 వేలకు చేరుకుంది. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మే 30, శుక్రవారం ఉదయం పలు వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ ధర రూ.97,030, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.88,940. గత రెండు రోజులలో తులం బంగారంపై ఎనిమిది వందల రూపాయలు తగ్గింది. అలాగే కిలో వెండి పై వంద రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.99,800 గా ఉంది.

నేడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, చెన్నై, బెంగళూరు మార్కెట్లో ఈరోజు స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ ధర రూ.97,030 గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.88,940 గా ఉంది.

మన దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల రూ.97,180, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,090 గా ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now