Weekly Horoscope: మే 11 నుంచి మే 17, 2025 మేష రాశి నుంచి మీన రాశి వరకు వార ఫలాల గురించి తెలుసుకుందాం.
మేష రాశి: ఉద్యోగ జీవితం హాయిగా గడిచిపోతుంది. వృత్తి మరియు వ్యాపారంలో తీరిక ఉండదు. ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాలలో కానీ విదేశాలలో కానీ ఉద్యోగం వస్తుంది. కొద్దిగా ప్రయత్నించడం వలన ధన లాభాలు పొందుతారు. ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. విద్యార్థులు బాగా కష్టపడాలి.
వృషభ రాశి: ఈ వారం అంతా వీరికి ఆడింది ఆటగా పాడింది పాటగా గడిచిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. విదేశాలలో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారంలో ఊహించిన దానికి మించి లాభాలు పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో డిమాండ్ ఉంటుంది. ఆస్తివాదం పరిష్కారం అవుతుంది. సొంత ఇంటి కల నెరవేర్చుకుంటారు. సంతానయోగం కలిగే అవకాశం ఉంది. బాగా సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మిథున రాశి: ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి.. ఉద్యోగం మారకూడదు. నిరుద్యోగులకు దూరప్రాంతాలలో ఉద్యోగం వస్తుంది. ప్రముఖులతో ఉన్న పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సాఫీగా సాగుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో శుభ పరిణామాలు జరుగుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి: కొన్ని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబంలో శుభపరిణామాలు జరుగుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. ఈ వారం కుటుంబ సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొద్దిపాటి శ్రమతో విద్యార్థులు విజయం సాధిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు మంచి శుభవార్తలు వింటారు.
సింహరాశి: ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. వృత్తి మరియు వ్యాపారంలో పని ఒత్తిడి పెరుగుతుంది. పెళ్లి మరియు ఉద్యోగ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. వారం చివరలో ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆహార విహారాలలో జాగ్రత్త వహించాలి. విద్యార్థులు బాగా కష్టపడాలి.
కన్య రాశి: ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. పదోన్నతి లభిస్తుంది. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి మరియు వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యక్తిగత మరియు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అనవసర ఖర్చులు ఇబ్బంది పడతాయి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. మరింత మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు అనుకూల సమయం. విద్యార్థులు విజయం సాధిస్తారు.
తులారాశి: ఈ వారం అంతా సంతోషంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో రాజయోగం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. షేర్లు మరియు స్పెక్యులేషన్లలో ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. శుభ పరిణామాలు జరుగుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో పోటీదారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.
వృశ్చిక రాశి: ఈ వారంలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపారంలో అనుకూల మార్పులు ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఆస్తివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. వ్యాపారంలో నిలకడ ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కొద్దిపాటి ప్రయత్నాలతో మంచి ఫలితాలు సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ధనస్సు రాశి: వృత్తి మరియు ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. అధికారుల నమ్మకం పొందుతారు. ఉద్యోగులకు విదేశాలలో ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. వృత్తి మయి వ్యాపారంలో బాగా రాబడి పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలు వినే అవకాశముంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు.
మకర రాశి: ఈవారం సంతోషంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అనుకూల మార్పులు జరుగుతాయి. పదోన్నతి లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. కుటుంబంలో శుభపరిణామాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగా పెరుగుతుంది. వ్యక్తిగత మరియు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. సల్ఫర్ అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాలి.
కుంభరాశి: ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆదాయ ప్రయత్నాలలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపారంలో ఆదాయం నిలకడగా ఉంటుంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. షేర్లు మరియు స్పెక్యులేషన్ల వలన స్వల్పంగా లాభాలు పొందుతారు. వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు మంచి విజయం సాధిస్తారు. పెళ్లి మరియు ఉద్యోగ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం.
మీనరాశి: ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో లాభాలు పొందుతారు. వృత్తి మరియు ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. ఖర్చులు ఇబ్బంది పెడతాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం పొందుతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాలి.