Vastu Tips: ఇంట్లో శనీశ్వరుడి దిశలో ఈ వస్తువు పెట్టకూడదు.. అది ఏ వస్తువు తెలుసా.!

Vastu Tips
Vastu Tips

Vastu Tips: వాస్తు శాస్త్రంలో శనీశ్వరుడి దిశకు ఒక ప్రాధాన్యత ఉంది. కొన్ని రకాల వస్తువులను ఇంట్లోనే శనీశ్వరుడు దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. చాలామందికి ఇంట్లో శనీశ్వరుడి దిశ ఏదో తెలియదు. వాస్తు శాస్త్రం ప్రకారం పశ్చిమ దిశ శనీశ్వరుడివి దిశగా చెప్తారు. కాబట్టి ఈ దిశలో పెట్టే వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఈ దిశలో చెత్త డబ్బాలు, బూట్లు అలాగే బరువైన వస్తువులను పెట్టడం అశుభంగా చెప్తారు. అలాగే ముదురు రంగులు మరియు విరిగిన వస్తువులను కూడా ఈ దిశలో పొరపాటున కూడా పెట్టకూడదు. తులసి మొక్కను కూడా ఈ దిశలో పెంచకూడదు. ఎల్లప్పుడూ పశ్చిమ దిశ తెరిచి ఉండాలి.

అయితే ఇంట్లోనే ఈ దిశలో నువ్వుల నూనెతో లేదా అవ్వ నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా నిపుణులు చెప్తున్నారు. హిందూమతంలో శనీశ్వరుడిని కర్మ ప్రధాన మరియు న్యాయదేవుడిగా పరిగణిస్తారు. శనీశ్వరుడు మనిషి చేసే కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు అని వాస్తు శాస్త్రం ప్రకారం చెప్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పశ్చిమ దిశ శనీశ్వరుడి దిశగా చెప్తారు. అటువంటి ఈ దిశలో చెత్త డబ్బాను పొరపాటున కూడా పెట్టకూడదు. అలా పెట్టడం వలన శనీశ్వరుడికి ఆగ్రహం కలుగుతుందని చెడు పెరుగుతుందని చాలామంది నమ్ముతారు.

అలాగే ఆ దిశలో బూట్లు, చెప్పులు, షూ స్టాండ్లు, మురికి బట్టలు అలాంటివి కూడా పెట్టకూడదు. ఇటువంటి వస్తువులు ఆ దిశలో పెట్టడం వలన ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఈ దిశలో బరువైన ఇనుప వస్తువులు, పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా విరిగిన గడియారాలు వంటివి కూడా పొరపాటున పెట్టకూడదు. ఇటువంటి వస్తువులను ఆ దిశలో పెట్టడం వలన శని పై అశుభ ప్రభావం కలుగుతుంది. అలాగే ఈ దిశలో ముదురు ఎరుపు, నలుపు లేదా చాలా ప్రకాశవంతమైన రంగులను కూడా ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన శనిగ్రహ ప్రభావంతో అసమతుల్యత ఏర్పడుతుంది, జీవితంలో కష్టాలకు దారితీస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now