New UPI Rules: UPI లావాదేవీలపై ఇక ఆ చార్జీలు ఉండవు.. ప్రభుత్వం కీలక ప్రకటన

New UPI Rules
New UPI Rules

New UPI Rules: యూపీఐ యాప్ ను చాలా మంది వాడుతుంటారు. అయితే కేంద్ర మంత్రివర్గం ఎం డి ఆర్ గా విధించే రుసుమును రద్దు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు కేటాయించాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం చిన్న దుకాణాదారులకు మరియు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఉంది. ఎవరైనా దుకాణదారుడు 2000 కంటే తక్కువ విలువైన యూపీఐ లావాదేవీలను నిరాకరించినట్లయితే ఒకసారి ఈ వార్తను చదవండి.

దుకాణదారులు మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించడం వల్ల యూపీఐ ద్వారా లావాదేవీలు చేయడానికి నిరాకరిస్తూ ఉంటారు. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం లావాదేవీలపై విధించే ఈ రుసుమును ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు బుధవారం రోజు ఎండిఆర్ పై విధించే చార్జీలను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను 2000 కంటే తక్కువ విలువ గల యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి దాదాపు రూ.1500 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించినట్లు తెలిపింది. ఈ పథకంలో భాగంగా ఒక వ్యక్తి దుకాణదారుడికి చేసే 2000 కంటే తక్కువ చెల్లింపులపై ఎన్టీఆర్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.

అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తీ నుండి దుకాణదారుడు తక్కువ విలువగల భీమ్ యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఈ పథకం ఆమోదించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే తక్కువ విలువ కలిగిన భీమ్ యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రోత్సాహక పథకం కింద ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు రూ. 1500 కోట్లు అంచనా వ్యయంతో అమలు చేసినట్లు తెలిపింది. అయితే ఈ పథకం కింద చిన్న వ్యాపారులకు మాత్రమే 200 వరకు యూపీఐ లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. చిన్న దుకాణదారుడి వర్గానికి చెందిన 200 వరకు లావాదేవీలకు లావాదేవీ విలువలో 0.15% ప్రోత్సాహకం కింద ప్రభుత్వం అందించనుంది. ఈ క్రమంలో వ్యాపారులపై రుసుము భారం తొలగిపోతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now