Powerful Military: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్మీ ఏ దేశంలో ఉందో తెలుసా.. భారత్ ఏ స్థానంలో ఉందంటే

Powerful Military
Powerful Military

Powerful Military: మన దేశం ఆపరేషన్ సింధూర్ తో కేవలం పాకిస్తాన్ దేశానికి మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు కూడా షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారత దేశం ఆయుధాలను చూసి షాక్ అవుతున్నాయి. మన దేశం రక్షణ రంగంలో మేక్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాలతో బాగా స్ట్రాంగ్ గా మారింది. భారత 21 వేల కోట్ల విలువైన ఆయుధ సామాగ్రిని గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకుంది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మరింత అత్యాధునిక రక్షణ ఉత్పత్తులను భారత దేశం దిగుమతి చేసుకోవాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసింది.

దిగుమతులతో పాటు ఎగుమతులలో కూడా మన దేశం సత్తా చాటుతుంది. మన ఆయుధ సామాగ్రిని దాదాపు ప్రపంచంలో ఉన్న 100 దేశాలకు ఎగుమతి చేసింది. భారత్ ఎగుమతి చేస్తున్న దేశాలలో అమెరికా, ఫ్రాన్స్, ఆర్మీనియా వంటి దేశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే మన దేశం డిఫెన్స్ పరంగా ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ రక్షణ సామాగ్రి ఎగుమతి కారణంగా గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. ఇటీవల సక్సెస్ అయిన ఆపరేషన్ సింధూర్ తో మన దేశం ప్రస్తుతం ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో భారత్ అమెరికా, రష్యా లాంటి దేశాలను కూడా దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి వ్యయం పెరిగిందని తాజాగా స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ఇచ్చింది.

ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఉగ్రవాదం, సైబర్ అటాక్స్ వంటి విపత్తుల కారణంగా తమ ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా సిప్రి తన నివేదికలో భారత్ కూడా తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచినట్లు తెలిపింది. సిప్రి తన నివేదికలో 2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన ఆర్మీ ఎదో తెలిపింది. సిప్రి ఇచ్చిన ఈ లిస్టులో అమెరికా దేశం అగ్రస్థానంలో ఉంది. పవర్ ఇండెక్స్ 0.0744 తో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికా దేశంలో ఆర్మీ సంఖ్య 20 లక్షల 35వేలుగా ఉందని సమాచారం. రెండో స్థానంలో రష్యా, మూడో స్థానంలో చైనా ఉంది. అలాగే నాలుగో స్థానంలో భారత్ ఉందని సమాచారం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now