Vastu Tips: లక్ష్మీదేవి, అన్నపూర్ణ దేవి నివాసం ఉండే వంటగదికి ఇంట్లో ప్రత్యేక స్థానం ఇవ్వబడుతుంది. కేవలం నిర్మాణం లో మాత్రమే కాకుండా వంట గది పరిశుభ్రత విషయంలో కూడా ప్రతిరోజు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిన్న చిట్కాలను వంటగదిలో పాటించడం వలన ఆ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి. పొరపాటున కూడా వంటగదిలో ఈ తప్పులు చేయకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఇంట్లో వంటగదిని వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో నిర్మిస్తారు. వంటగదిని సరైన రంగుల ఎంపికతో నిర్మించడం వలన ఆ ఇంట్లో వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఆ ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యం మరియు ఆనందం కూడా పెరిగేలా చేస్తుంది. వంటగదిని ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొన్ని సింపుల్ వాస్తు చిట్కాలను పాటించడం వలన ఆ ఇంట్లో ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది. రాత్రిపూట ఆహారం తిన్న పాత్రలను కడగకుండా అలాగే వదిలేయకూడదు. ఈ విధంగా చేయడం వలన ఆ ఇంట్లో రాహువు ప్రభావం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
ప్రతిరోజు రాత్రికి రాత్రే తిన్న పాత్రలను శుభ్రం చేసి నిద్రపోవడం వలన ఆ ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు కలుగుతాయి. వంటగదిలో చీపురును పెట్టకూడదు. చీపురు ప్రతికూల శక్తిని కలిగిస్తుంది కాబట్టి అటువంటి చీపురును వంటగదిలో పెడితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి కలుగుతుంది. ఇటువంటి చీపురును వంటగదికి దూరంగా పెట్టడం మంచిది. ఇంట్లో వంట గదిలో పాత్రలు కడగడానికి ఉపయోగించే సింక్ ఆ ఇంటి ఈశాన్య దిశలో ఉండాలి. ఈశాన్య దిశా ప్రతి ఇంటికి శుభ్రతను తీసుకొని వస్తుంది. ఈ దిశలో సింక్ ఉండడం వలన ఆ ఇంట్లో శక్తి ప్రవాహం కూడా పెరుగుతుంది. వంటగదిలో నల్ల రంగులో ఉన్న టైల్స్ పెట్టడం వలన అవి ఆ ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. తెలుపు లేదా లేత నీలం వంటి లేత రంగు ఉన్న టైల్స్ ను వంటగదిలో పెట్టడం మంచిది.