Vastu Tips: పొరపాటున కూడా ఎరుపు రంగు పూల మొక్కను.. ఇంట్లో ఈ దిక్కులో పెట్టకూడదు.. పెడితే సమస్యలు తప్పవు

Vastu Tips
Vastu Tips

Vastu Tips: తమ ఇంటి ఆవరణలో చాలామంది రకరకాల పూల మొక్కలను పెంచుతూ ఉంటారు. ఆ పూల మొక్కలు ఇంటికి అందాన్ని పెంచడమే కాకుండా పర్యావరణానికి కూడా చాలా మేలు చేస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెంచుకునే పూల మొక్కల విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. చాలామంది తమ ఇంట్లో పూజ కోసం లేదా ఇంటికి అందాన్ని పెంచడం కోసం తెలుపు, ఎరుపు, పసుపు, నీలం ఇలా రంగుల మొక్కలను పెంచుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎరుపు రంగు మొక్కలను ఇంట్లో పెంచుకోవాలంటే కొన్ని వాస్తు నియమాలను పాటించాలి అని నిపుణులు చెప్తున్నారు.

సాధారణంగా ఈ రంగు మొక్కలను ఇంట్లో పెంచడం ఆ ఇంట్లో సానుకూల శక్తిని కలిగిస్తుంది. కానీ దీనిని సరైన దిశలో పెట్టడం వలన ఆ ఇంట్లో సుఖశాంతులు కూడా కలుగుతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఎరుపు రంగును ప్రేమకు, అగ్నికి, శక్తికి అలాగే ఉత్సాహానికి చిహ్నంగా చెప్పారు. ఎరుపు రంగు మొక్కలను ఇంటి ఆవరణలో పెంచడం వలన ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరిగే ఆ వాతావరణం ఉత్సాహంగా మారుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు మంచి బంధం కూడా ఏర్పడుతుంది. కొన్ని కొన్ని సార్లు ఎరుపు రంగు అదృష్టాన్ని కూడా కలిగిస్తుంది అని చాలామంది నమ్ముతారు.

ఈ రంగు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి ఇది ఇంటికి మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. తూర్పు దిక్కు సూర్యునికి సంబంధించిన దిక్కు కాబట్టి ఈ దిక్కులో ఎరుపు రంగు మొక్కలను పెంచడం వలన ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడి ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే దక్షిణ దిక్కులో ఎరుపు రంగు పూల మొక్కను పెంచడం వలన ఇంట్లో శక్తి ప్రవాహం సమతుల్యంగా ఉంటుంది. మరి ఎక్కువ ఎరుపు రంగు ఉన్న మొక్కలను ఈ దిక్కులో పెంచడం వలన కొన్నిసార్లు చికాకు వంటి సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణ దిక్కులో మితంగా ఈ మొక్కలను పెంచాలి. పశ్చిమ దిక్కుల ఈ మొక్కలను పెంచడం అంత మంచిది కాదు. ఉత్తర దిక్కులో కూడా ఈ మొక్కలను ఉంచడం అంత మంచిది కాదు అని నిపుణులు చెప్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now