Vastu Tips: ఇంట్లో వాస్తుకు సంబంధించిన తప్పులు కూడా ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల అనారోగ్యానికి కారణం అవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల కారణంగా ఆ ఇంట్లో ప్రతికూల శక్తి వస్తుంది. కాబట్టి కొన్ని విషయాలలో వాస్తు శాస్త్రం ప్రకారం జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఇంటి చుట్టు ప్రతికుల శక్తి తిరుగుతూ ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఆ ఇంట్లో ఏమైనా వాస్తు సమస్య ఉందేమో వెంటనే తెలుసుకోండి. పర్యావరణం కారణంగా కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది కానీ వాస్తు శాస్త్రాన్ని పట్టించుకోకుండా పొరపాటున ఇంట్లో కొన్ని వస్తువుల వలన కూడా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి ఇంట్లో సభ్యులు అనారోగ్యానికి గురవుతారు.
కాబట్టి ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల విషయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. వాస్తు శాస్త్రాన్ని పాటించడం వలన శారీరత మరియు మానసిక ఆరోగ్యాలు మెరుగ్గా ఉంటాయి. ఇంట్లో దక్షిణ దిక్కును యమ ధర్మరాజు దిక్కుగా చెప్తారు. కాబట్టి ఇంట్లో పొరపాటున కూడా ఈ దిక్కులో మంచం పెట్టకూడదు. దక్షిణం వైపు పాదాలు పెట్టి పడుకునేలా ఉండాలి. దక్షిణం వైపు తలపెట్టి పడుకోవడం వలన తలనొప్పి, కాళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
శరీరంలో ఉన్న ఇతర భాగాలలో కూడా ఎల్లప్పుడూ నొప్పిగా అనిపిస్తుంది. ఇంట్లో తలుపులు మరియు కిటికీలు తెరిచి ఉంచడం వలన ఆ ఇంట్లోకి తాజాగాలి లోపలికి వస్తుంది. స్వచ్ఛమైన గాలి బయట నుంచి ఇంట్లోకి రావడం వలన ఇంట్లో సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మంచి వెంటిలేషన్ కోసం మీరు ఇంట్లో ఉన్న అన్ని తలుపులు కిటికీలు తెరిచి పెట్టుకోవాలి. ఇలా మూసి ఉంచితే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం సమయాలలో తలుపులు మరియు కిటికీలు మూసి ఉంచడం వలన ఆ ఇంట్లో ఉన్న సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది.