Free Distibution: ఆర్మూర్ టౌన్, ఆగస్టు 09 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జిరాయత్ నగర్ కాలనీలో గడిచిన 31 సంవత్సరాలుగా నాగుల పంచమి పండుగ సందర్భంగా పీసీసీ మాజీ కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్ మాతృమూర్తి ఖాందేష్ గంగుబాయి ఆధ్వర్యంలో వారి ఇంటివద్ద ఉచితంగా ఆవుపాల పంపిణీ నిర్వహిస్తున్నారు.
శనివారం నాగుల పంచమి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు 470 మంది పట్టణ ప్రజలకు ఉచితంగా ఆవు పాలు పంపిణీ చేశారు.
మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఖాందేష్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కౌన్సిలర్, బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు, లీగల్ కౌన్సిల్ మెంబర్, ప్రముఖ మహిళా న్యాయవాది సంగీత ఖాందేష్ మాట్లాడుతూ గత 31 సంవత్సరాలుగా తమ కుటుంబ సభ్యులం పవిత్ర నాగుల పంచమి సందర్భంగా ఉచితంగా ఆవు పాలు పంపిణీ చేయడం చాలా గర్వకారణంగా వుందని అన్నారు. అలాగే స్థానిక కాలనీవాసులకు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛతనం పచ్చదనం పాటించాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం, కుటుంభ సభ్యులు ఖాందేష్ నరేందర్, ఖాందేష్ సురేష్, ఖాందేష్ వెంకట వైభవ్, ఖాందేష్ నాగలత తదితరులు పాల్గొన్నారు.