Health Fact: స్త్రీలు వెండి పట్టీలు ధరించడం వలన.. జరిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Health Tips
Health Tips

Health Fact: స్త్రీలు వెండి పట్టీలు ధరించడం వలన.. జరిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

మన దేశ సంస్కృతిలో స్త్రీ, పురుషులు ధరించే ఆభరణాలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. చాలామంది మహిళలు అందరూ దాదాపుగా వెండి పట్టీలను ధరిస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ప్రతి స్త్రీ వెండి పట్టీలు ధరిస్తుంది. మన దేశ సంప్రదాయంలో బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి బంగారంతో తయారు చేసిన స్త్రీలను కాళ్లకు ధరించరు. కానీ వెండి పట్టీలను కాళ్లకు ధరించడం గౌరవనీయమైన ఆచారంగా పరిగణిస్తారు. ఇది కేవలం అలంకరణలో ఒక భాగం మాత్రమే కాదు దీని వెనుక అనేక శాస్త్రీయ, ఆయుర్వేద అలాగే మతపరమైన కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి.

హిందూమత శాస్త్రం ప్రకారం వెండి పట్టీలను కాళ్లకు ధరించడం అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఇది వివాహం జరిగిన స్త్రీల వైవాహిక జీవితానికి సంకేతంగా చెప్పబడింది. పెళ్లయిన మహిళలు వీటిని ధరించడం వలన ఆ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. అలాగే వెండిని సానుకూల శక్తికి ప్రవాహంగా శాంతి మరియు స్వచ్ఛతకు చిహ్నంగా కూడా పరిగణిస్తారు. వెండి పట్టీలు స్త్రీలు ధరించడం వలన ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని ప్రతికూల శక్తిలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. పట్టీల నుంచి వచ్చే గలగల శబ్దం ఆ ఇంటి పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. మనసుకు ప్రశాంతత కలిగేలా చేస్తుంది.

వెండి పట్టీలు ధరించడం వలన కొన్ని గ్రహాలు కూడా బలపడి వివాహిక జీవితంలో మాధుర్యం మరియు శ్రేయస్సు కలుగుతాయి. ఇవి శరీరంలో సానుకూల శక్తి పెరిగేలా చేస్తుంది. అలాగే వీటిని ధరించడం వలన రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. చీల మండలం దగ్గర వెండి పట్టీలను ధరించడం వలన రెండు పాదాలలో కొన్ని బిందువులపై ఒత్తిడి పెరగడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. వీటి వలన పాదాలలో నొప్పి లేదా వాపు వంటివి తగ్గిపోతాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now