September 16, 2024
Armoor

Armoor: 43 కోట్లతో తాగునీటి విస్తరణ పనులు

Armoor: ఆర్మూర్ టౌన్, ఆగస్టు 06 (ప్రజా శంఖారావం) : ఆర్మూర్ మున్సిపల్ పట్టణం పరిధిలో తాగునీటి విస్తరణ పనుల కోసం రూ.43 కోట్ల నిధులను వెచ్చించనున్నామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఎమ్మెల్యేలు మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించి తాగునీటి సరఫరా తీరుతెన్నులను పరిశీలించారు. సిద్ధులగుట్టపై గల పంప్ హౌస్, హౌసింగ్ బోర్డు కాలనీ, ధోబీఘాట్ వాటర్ ట్యాంకులు, బాల్కొండ గుట్టపై గల మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకును సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డిల వెల్లడి

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి వనరులను పెంపొందించేందుకై అమృత్ 2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆర్మూర్ మున్సిపాలిటీకి రూ. 43 కోట్ల నిధులను మంజూరు చేశాయని తెలిపారు. ఈ నిధులతో అవసరమైన చోట కొత్త ట్యాంకుల నిర్మాణాలు, పైప్ లైన్ ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.

కలెక్టర్ తో కలిసి పంప్ హౌస్, వాటర్ ట్యాంకుల పరిశీలన

ఈ పనులు పూర్తయితే రానున్న మరో 20 ఏళ్ల వరకు ఆర్మూర్ పట్టణంతో పాటు పెర్కిట్, మామిడిపల్లి తదితర ప్రాంతాల ప్రజలకు తాగు నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ట్యాంకుల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించిన ప్రతిపాదిత స్థలాలను ఎమ్మెల్యేలు, కలెక్టర్ సందర్శించిన సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఫైప్ లైన్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి నివాస ప్రాంతానికి శుద్ధి చేయబడిన రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలెవరూ తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా పనులను పక్కాగా జరిపించాలని హితవు పలికారు.

ప్రజోపయోగ పనులలో నిర్లక్ష్యానికి తావిస్తే, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంచర్ లు ఏర్పాటు చేస్తున్న వారు తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. వీరివెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, డీసీసీబి చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు ఆకుల రాము, ప్రసాద్ తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *