Jagityala: జగిత్యాల జిల్లా/మెట్ పల్లి, మే12 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు, జ్యోత్స్న దంపతులకు శనివారం బాబు జన్మించాడు. శిశువు అనారోగ్యంతో ఉండడంతో, మెరుగైన వైద్యం అందించాలనీ డ్యూటీ డాక్టర్ సాయి కృష్ణ తన ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని తల్లిదండ్రులకు సూచించాడు.
దీంతో శిశువును ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శిశువు పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో ఆ శిశువు మరణించాడు. మాతాశిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి, వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now