Brother Attack: మెట్ పల్లి, ఆగస్టు 15 (ప్రజా శంఖారావం): ఇబ్రహీంపట్నం మండలం సత్తక్కపల్లి శివారులోని వరద కాలువ వద్ద చెల్లెను బండరాళ్ళతో కొట్టిన అన్న. చనిపోయిందనుకుని వదిలివెళ్ళిపోయాడు. తీవ్ర గాయాలతో పడిపోయిన సదరు బాధితురాలు నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన బోదాసు మానస గా గుర్తించారు. తీవ్ర గాయలతో పడి ఉన్న మానసను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. బాధితురాలి
పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన బాధితురాలి అన్నపై తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now