BUSINESS IDEA: తక్కువ పెట్టుబడితో వ్యాపారం.. నెలకు 20 నుండి 30 వేల ఆదాయం..

Business Idea
Business Idea

BUSINESS IDEA: తక్కువ పెట్టుబడితో వ్యాపారం.. నెలకు 20 నుండి 30 వేల ఆదాయం..

సొంతంగా వ్యాపారం చేస్తూ ఎదగాలని చాలామంది అనుకుంటారు. కొంతమంది తాము చదివిన చదువుకు ఉద్యోగాలు రాక ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్ళదిస్తారు. కానీ మనం ఉన్న ఊర్లో, మనం ఉన్నచోటే తక్కువ పెట్టుబడితో సొంతంగా వ్యాపారం ప్రారంభించి ప్రతి నెల 20 నుండి 30 వేల రూపాయల ఆదాయం సంపాదించే మార్గం మీకోసం.. ఒకరి కింద పని చేయకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ సొంతంగా తమ కాళ్లపై నిలబడి వ్యాపారం చేసుకుంటూ వృద్ధి చెందడానికి ఇదో చక్కటి ఉపాయం..

పల్లెటూర్లలో ఏ వ్యాపారం చేయాలో అర్థం కాక పట్టణాలకు వలస పోతూ కేవలం పట్టణాల్లోనే పనిచేసుకుంటూ జీవితాలు బాగుపడతాయని చాలామంది భావిస్తుంటారు. అలా అనుకోవడం మన పొరపాటు. మన వద్ద చేయగలిగిన సత్తా ఉంటే, దృఢ సంకల్పంతో వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకుంటే ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు. పల్లెటూర్ల నుండి పట్టణాలకెళ్లి వ్యాపారాలు చేస్తూ లాభాలు గడించిన వారు ఉన్నారు. నష్టాలు చవిచూసిన వారు ఉన్నారు. కానీ మనవాళ్లతో అందరి మధ్యలో ఉండి ఈ వ్యాపారం చేస్తూ అభివృద్ధి చెందడం పెద్ద కష్టతరమేమీ కాదు. ఈ వ్యాపారానికి కావలసింది తక్కువ పెట్టుబడి పెట్టి మంచి లాభాలను కూడా గడించవచ్చు.

వ్యాపారానికి పెట్టుబడి.. మార్కెటింగ్..

ఈ వ్యాపారానికి కావలసిందల్లా కేవలం మన వద్ద ₹10 వేల రూపాయలు ఉంటే చాలు. చేయబోయే వ్యాపారనికి సంబంధించిన ముడి సరుకులతో పాటు అన్ని వస్తువులను సమకూర్చుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వ్యాపారం మన ఇంట్లో ఉన్న సామాగ్రితోనే సరి పెట్టుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం… ముఖ్యంగా మనం ఇప్పుడు చేయబోయే “పచ్చళ్ళ వ్యాపారం” చాలా సులభమైనది ఈ వ్యాపారానికి కేవలం ₹ 10వేల రూపాయల పెట్టుబడి ఉంటే చాలు. ముందుగా ఈ పచ్చళ్ళ వ్యాపారానికి అవసరమయ్యే ముడి సరుకులు పల్లెటూర్లలో చాలా చౌకగా దొరుకుతాయి మరియు నాణ్యమైనవి కూడా దొరుకుతాయి. దీనికి తోడు ఇరుగుపొరుగు ఉండే అవ్వ, అక్క, చెల్లి, ఆయి, తాత ఊళ్ళో ఉండే యువత తో సులభంగా మామిడి, ఉసిరి, టమాటో మొదలైన పచ్చళ్లను తయారుచేసి స్థానికంగా ఉండే కిరాణా షాపులలో విక్రయిస్తూ మన వ్యాపారానికి మొదటి మార్కెటింగ్ మొదలు పెడితే వ్యాపారం మొదటి మెట్టు ఎక్కినట్లు అవుతుంది.

నాణ్యమైన సరుకులు వాడితే మంచి డిమాండ్..

వ్యాపారానికి కావలసిన ముడి సరుకులు నాణ్యమైనవి వాడి, పచ్చళ్ళు తయారు చేసే సమయంలో పరిశుభ్రత పాటించి, ప్యాకింగ్ చేసే సమయంలో ఎక్కువ కాలంనిల్వ ఉండడానికి మంచి ప్యాకింగ్ వాడితే సరిపోతుంది. అలాగే మెల్లిమెల్లిగా ఈ పచ్చళ్ళను పట్టణాలకు విస్తరిస్తూ మార్కెటింగ్ చేసుకుంటే ఎక్కువ లాభాలను కూడా గడించవచ్చు. మరీ ముఖ్యంగా పల్లెటూర్లలో చేసిన పచ్చళ్లను చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే మనం వాడే ముడి సరుకులు నాణ్యమైనవి ఉంటాయి, అలాగే శుభ్రంగా మనం ఇంట్లో వాడే మసాలా దినుసులు వాడతాం కాబట్టి ఆరోగ్యానికి కూడా హాని కాకుండా బాగుంటాయి. ఇప్పుడు ప్రతి చోట ఉద్యోగం చేస్తూ బిజీగా గడిపే వారికి కొన్ని రకాల పచ్చళ్లతో చాలా సందర్భాల్లో వాళ్ళ భోజనం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మరి ముఖ్యంగా కర్రీ పాయింట్లలో కూడా పికిల్స్ వాడడానికి భోజన ప్రియులు ఆసక్తిని చూపుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం మనం వ్యాపారం చేస్తూ మరో నలుగురికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశం మీకుంటే మీరు ఉన్నచోటే తక్కువ పెట్టుబడితో ఈ పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభించి మీ భవిష్యత్తు ఆదాయానికి మార్గం ప్రారంభించండి.

ప్రభుత్వపరంగా బ్యాంకు రుణాలను అన్వేషించండి..

చిన్నముత్తాలతో ప్రారంభించే వ్యాపారాలకు కూడా స్థానికంగా ఉండే బ్యాంకులు ఆర్థికంగా సహాయం అందించడంలో ప్రభుత్వపరంగా చాలా పథకాలు కూడా ఉంటాయి. వాటిని కూడా ఒకసారి అన్వేషించి ఆ పథకాల ద్వారా ఆర్థిక సహాయం పొందండి. ఈ పచ్చళ్లకు మార్కెటింగ్ చేసుకుంటూ మీరు ఆన్లైన్లో కూడా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. వాటిని కూడా అన్వేషించి మీ వ్యాపారాన్ని ప్రారంభించి ప్రతినెల 20 నుండి 30 వేల ఆదాయం పొందడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించడానికి ఈ వ్యాపారం మీకు లాభసటిగా ఉంటుంది. పచ్చర్ల వ్యాపారంలో మనం చేసే మార్కెటింగ్ బట్టి మన ఆదాయం కూడా ఆధారపడి ఉంటుంది. ఇది గమనించండి…

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now