Credit Score: చాలామందికి క్రెడిట్ కార్డు గురించి తెలిసే ఉంటుంది. అయితే వాళ్లు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన క్రెడిట్ స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది. క్రెడిట్ స్కోరు కాపాడుకోవడానికి కనీస చెల్లింపులు చేయడం చాలా అవసరం. అలాగే పదేపదే లోన అప్లై చేయకపోవడం, బ్యాంకులతో మాట్లాడడం మరియు ముందుగా చెల్లింపులు చేయడం వంటివి చేస్తూ ఉండాలి.
ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక సంక్షోభం ఏదో ఒక సమయంలో వస్తుంది. అనుకోకుండా ఉద్యోగం కోల్పోవడం, వైద్యపరంగా అత్యవసర పరిస్థితి, పిల్లల ఖర్చులు వంటి అనేక కారణాల వలన ప్రతి ఒక్కరూ ఆర్థిక సంక్షోభాన్ని పొందుతారు. అలాంటి సమయంలో మీరు రుణ ఈ ఎం ఐ బిల్లులు మరియు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడంలో కష్టాలు పడాల్సి వస్తుంది.
ఈ క్రమంలో ఆ వ్యక్తి యొక్క క్రెడిట్ కార్డు స్కోరు చాలా దారుణంగా పడిపోతుంది. అయితే ఒకసారి క్రెడిట్ స్కోర్ తగ్గిపోతే ఆ స్కోర్ ను మళ్ళీ మెరుగుపరచడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని నియమాలను మీరు తప్పకుండా పాటిస్తే మీ క్రెడిట్ కార్డ్ స్కోరు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన సమయంలో మీకు క్రెడిట్ కార్డులకు కనీస బిల్లు చెల్లించాలి. ఇది మీ క్రెడిట్ స్కోరును కాపాడడంలో సహాయపడుతుంది.
క్రెడిట్ కార్డ్ బిల్లులో రెండు మతాలు ఉంటాయి. అందులో మొత్తం బిల్లు, కనీస బిల్లు అని రెండు రకాలుగా ఉంటుంది. కనీస బిల్లును మీరు చెల్లించడం ద్వారా ఆలస్య రుసుములను నివారించవచ్చు. ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి మీరు పదేపదే వ్యక్తిగత లోను కోసం దరఖాస్తు చేసుకోకూడదు. ఒక వ్యక్తి బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సి కంపెనీ నుంచి లోన్ కోసం ఎక్కువ సార్లు దరఖాస్తు చేసుకుంటే ఆ బ్యాంకులో మీకు క్రెడిట్ నివేదికను అంత త్వరగా అభ్యర్థిస్తాయి మరియు ఈ క్రమంలో మీకు క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది.