Daily Horoscopes: ఈ రాశుల వారికి అదృష్ట ఫలాలు.. 12 రాశుల దిన ఫలాలు 20 మార్చ్, 2025 గురువారం నాటి 12 రాశి ఫలాలు. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు దిన ఫలాలు ఇవే..
మేషరాశి:
వీళ్ళు అనుకోని ప్రయాణాలు చేస్తారు. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం, వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది.
వృషభ రాశి:
నూతన ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. సన్నిహితులు లేదా బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి.
మిథున రాశి:
వీళ్లు కాంట్రాక్టులు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మీ సత్తా చూపిస్తారు. నూతన విద్యా అవకాశాలు పొందుతారు.
కర్కాటక రాశి:
వీళ్లు కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు జరుగుతాయి. ఆర్థిక విషయాలు కొంతవరకు నిరుత్సాహ పరుస్తాయి. మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు ఏర్పడే అవకాశం ఉంది.
సింహరాశి:
కుటుంబంలో చికాకులు నిరాశకు గురిచేస్తాయి. వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో నిరుత్సాహం ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడతాయి. బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం ఉంటుంది. శ్రమించాల్సి ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలలో అవాంతరాలు తప్పవు.
కన్యరాశి:
కొత్త పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. మిత్రులతో సక్షేత ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక సమాచారం పొందుతారు. వాహన యోగం ఉంది. వృత్తి మరియు ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటారు.
తులారాశి:
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి. వ్యాపారాలు కొంచెం నిరుత్సాహపరుస్తాయి. దైవ క్షేత్రాలను సందర్శిస్తారు.
వృశ్చిక రాశి:
ఒక ముఖ్యమైన సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకున్న కాంట్రాక్టులు లభిస్తాయి. బంధువులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కళాకారులకు పురస్కారాలు లభించే అవకాశం ఉంది.
ధనస్సు రాశి:
ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారాలు కొంతవరకు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం ఉంటుంది.
మకర రాశి:
బంధువుల కలయిక ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వృత్తి మరియు ఉద్యోగాలలో ఉన్న ఒత్తిడిలు తొలగిపోతాయి.
కుంభరాశి:
వీరి పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు చక చకా ముందుకు సాగుతాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
మీనరాశి:
ఎంత కష్టపడినా కూడా ఫలితం అంతగా కనిపించదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయట కొంత నిరుత్సాహం ఉంటుంది. ఆరోగ్య భంగం ఉంటుంది. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడిలో తప్పవు.