Todays Gold Rate: ప్రపంచవ్యాప్తంగా ఎల్లో మెటల్ కు బాగా డిమాండ్ ఉంటుంది. బులియన్ మార్కెట్లో వీటి ధరలు కొన్ని కొన్ని సార్లు తగ్గుతూ ఉంటే మరికొన్నిసార్లు పెరుగుతుంటాయి. వీటి ప్రభావం మన దేశ మార్కెట్లో కూడా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో బంగారం ధర ఎన్నడూ లేని ఆల్టైమ్ హై రికార్డుకు చేరుకుంది. ఏప్రిల్ నెలలో బంగారం ధరలు లక్ష మారుకుని దాటాయి. ఆ తర్వాత మళ్లీ తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి.
గతంలో 95 వేలకు అదిగి వచ్చిన బంగారం ధరలు ఆ తర్వాత మరికొన్ని రోజులలోనే 98 వేలకు కూడా చేరుకున్నాయి. ప్రస్తుతం వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి. జూన్ 1, 2025 పలు వెబ్సైట్స్ లో ఉన్న వివరాల ప్రకారం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములు రూ.97,310, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.89,200 గా ఉన్నాయి. ఇక కిలో వెండి ధర రూ.99,900 గా ఉందని సమాచారం.
మనదేశంలో పలు ముఖ్యమైన నగరాలలో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, చెన్నై మరియు బెంగళూరు నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రేటు రూ.97,310, 22 క్యారెట్ల బంగారం రేటు రూ.89,200. ఈ నగరాలలో కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది.
ఇక మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములు రూ.97,460, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,350 గా ఉంది. అలాగే ఈ నగరంలో కిలో వెండి ధర రూ.99,900 గా ఉంది.