MOBILE CHARGE: మనలో చాలామందికి స్మార్ట్ ఫోన్లను చార్జ్ చేయడం వలన విద్యుత్ బిల్లు ఎంత పెరుగుతుంది అనే ప్రశ్న ఉంటుంది. అయితే ఫోన్ చార్జింగ్ చేయడానికి చాలా తక్కువ విద్యుత్ వినియోగం అవుతుంది. ఫోన్ చార్జింగ్ చేయడం వలన ఒక నెల లేదా ఒక సంవత్సరంలో ఎంత విద్యుత్ బిల్లు వినియోగం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్ చార్జర్లు సాధారణంగా ఐదు నుంచి 20వాట్ల శక్తిని కలిగి ఉంటాయి. మామూలు చార్జర్లు అయితే ఐదు వాట్స్ శక్తి కలిగి ఉంటాయి. ఇక ఫాస్ట్ చార్జర్లు అయితే 18 నుంచి 20 వాట్స్ లేదా అంతకంటే ఎక్కువ శక్తిని కలిగి ఉండవచ్చు.
ఒక స్మార్ట్ ఫోన్ పూర్తిగా చార్జ్ కావడానికి ఒకటి నుంచి రెండు గంటల సమయం పడుతుంది. ఫోన్ మోడల్ మరియు చార్జర్ పై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు పదివాట్ల చార్జర్ ని ఉపయోగించి రెండు గంటల సమయంలో ఫోన్ ను చార్జ్ చేస్తారని అనుకుంటే మీ ఫోనును ఒకసారి చార్జి చేయడానికి 0.02 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. అంటే ఏడాదికి దాదాపు 7 నుంచి 10 యూనిట్లు వినియోగం అవుతుంది. యూనిట్కు విద్యుత్ రేటు ఏడు రూపాయలు ఉన్నట్లయితే ఫోన్ చార్జి చేయడానికి ఏడాదికి 70 రూపాయలు అవుతుంది.
యూనిట్ ధరపై ఈ ఖర్జూ ఆధారపడి ఉంటుంది. ఫోన్ పూర్తిగా చాట్ అయిన తర్వాత కూడా కొంతమంది చార్జర్ ను అలాగే లెగ్ ఆన్ లో ఉంచేస్తారు. దీనివలన కూడా కొంత విద్యుత్ ఖర్చు అవుతుంది. ఇలా చేయడం వలన విద్యుత్ వృధా అవుతుంది. కొన్ని వాట్స్ వృధా అవుతుంది. ఇది ఖర్చును పెంచుతుంది. ఫోన్ చార్జింగ్ పూర్తిగా అయిన తర్వాత ప్లగ్ నుండి చార్జర్ ను తీసివేయాలి. ఇలా చేయడం వలన విద్యుత్ బిల్లులు పెరగకుండా ఉంటాయి. అలాగే మీరు పాత చార్జర్ కు బదులుగా కొత్తవి లేదా సమర్థవంతమైన చార్జర్ ను ఉపయోగించడం వలన కూడా విద్యుత్ను మరింతగా తగ్గించుకోవచ్చు.