Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ పొరపాట్లు చేయకండి.. లేకపోతే ఇబ్బందులు తప్పవు

Gold Loan
Gold Loan

Gold Loan: ఆర్థిక అవసరాలలో చాలామంది బంగారంపై బ్యాంకులలో నుంచి లోన్ తీసుకుంటారు. బ్యాంకుల నుంచి ఇతరు రుణాల కంటే కూడా బంగారంపై తీసుకున్నారు చాలా త్వరగా లభిస్తుంది. దీనికి పెద్ద ప్రాసెస్ అవసరం ఉండదు. కేవలం కొన్ని నిమిషాలలోనే మీరు బ్యాంకులో నుంచి బంగారంపై రుణం తీసుకోవచ్చు. ప్రస్తుతం మన దేశంలో బంగారం లోన్ మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. అలాగే మన దేశంలో రుణ గ్రహీతలతో పాటు రుణ డిఫాల్ట్ లు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

బంగారంపై రుణం తీసుకున్నప్పుడు కొన్ని విషయాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. చాలామంది బ్యాంకులో బంగారాన్ని తాకట్టుగా పెట్టి ఆ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. కానీ సకాలంలో దీనిని చెల్లించకపోతే ఆ బంగారం రుణం డిఫాల్ట్ గా మారుతుంది. ఇటువంటి సమయాలలో వాళ్లు తాకట్టు పెట్టిన బంగారు నగలను జప్తు చేయడమే కాకుండా వీటి ప్రభావం వారికి క్రెడిట్ స్కోరుపై కూడా చెడు ప్రభావం చూపిస్తుంది. బంగారం పై తీసుకున్న రుణాన్ని ఎగవేస్తే మీరు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను జప్తు చేసి వాటిని అమ్మేస్తారు.

రుణం బ్యాంకుకు తిరిగి చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో మీరు భవిష్యత్తులో ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవలసి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ పై కూడా పడుతుంది. ఇకపై భవిష్యత్తులో బ్యాంకు నుంచి మీరు రుణం పొందడం కష్టం అవుతుంది. బంగారంపై బ్యాంకు నుంచి రుణం తీసుకునే ముందు మీరు కొన్ని పత్రాలను చాలా జాగ్రత్తగా చదవాలి. ముఖ్యంగా ఇందులో మీరు వడ్డీ రేట్లు, ఈఎంఐ, రుణం తిరిగి చెల్లించే సమయం అలాగే ప్రాసెసింగ్ చార్జీల గురించి వివరంగా తెలుసుకోవాలి. ఆ లోన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బంగారం విలువలో మీరు 75% బంగారం పై రుణం తీసుకోవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now