Astro Tips: ఈ 3 వస్తువులను పొరపాటున కూడా దిండు కింద లేదా మంచం కింద పెట్టకూడదు.. పెడితే చాలా నష్టాలు తప్పవు

Astro Tips
Astro Tips

Astro Tips: ప్రముఖ జ్యోతిష్యుడు డాక్టర్ అరవింద్ పచౌరి రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో మంచం కింద పర్సు లేదా బంగారు ఆభరణాలు వంటివి పెట్టకూడదు అని సూచిస్తున్నారు. ఇలా ఉంచినట్లయితే అవి ఆర్థిక సమస్యలకు దారితీస్తాయని అందరి నమ్మకం. రాత్రి నిద్రిస్తున్న సమయంలో దిండు కింద లేదా మంచం కింద డబ్బు లేదా పర్సును పెట్టకూడదు. లక్ష్మీదేవి నివసించే స్థానం పర్స్ కాబట్టి దానిని దిండు కింద లేదా మంచం కింద పెడితే లక్ష్మీదేవి అగ్రహానికి గురవుతారు. ఈ క్రమంలో మీరు భవిష్యత్తులో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఆ ఇంట్లో డబ్బు ప్రవాహం కూడా తగ్గిపోతుంది.

కొంతమంది రాత్రి నిద్రపోతున్న సమయంలో తమ దిండు కింద లేదా మంచం కింద బంగారు ఆభరణాలను దాచుకుంటారు. కానీ ఈ విధంగా బంగారు ఆభరణాలను దిండు కింద లేదా మంచం కింద పెట్టడం కూడా శుభప్రదం కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. బంగారంలో లక్ష్మీదేవి ఉంటుంది అని అందరి నమ్మకం. లక్ష్మీదేవి ఉండే బంగారాన్ని తల దగ్గర దిండు కింద పెట్టుకోవడం వలన లక్ష్మీదేవిని అవమానించడమే.

దీని కారణంగా కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి కొంతమంది మహిళలు దిండు కింద లేదా వాళ్లు నిద్రపోతున్న మంచం కింద ఇనప పెట్టేలా తాళాలను కూడా పెట్టుకుంటారు. కానీ ఇవి కూడా పెట్టకూడదు. ఏ రకమైన తాళాలు అయినా మంచం కింద లేదా దిండు కింద పెట్టడం వలన ఆ ఇంట్లో డబ్బు కొరత పెరుగుతుంది. డబ్బు ఆదా తగ్గిపోతుంది. మా ఇంట్లో డబ్బు ప్రవాహం కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. వీటి ప్రభావం సంపాదించే ప్రతి పైసా పై పడుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now