Drone car: ట్రాఫిక్ సమస్యకు చెక్.. గాల్లో ఎగిరే బుల్లి డ్రోన్ కారు..!

Small Drone Car
Small Drone Car

Drone car: ట్రాఫిక్ సమస్యకు చెక్.. గాల్లో ఎగిరే బుల్లి డ్రోన్ కారు..!

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న దేశం మనది. అలాంటి పరిజ్ఞానం మేధస్సు కలిగిన నైపుణ్యవంతులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటివరకు వ్యవసాయ రంగానికి సంబంధించి అత్యాధునిక అధునాతన పరికరాలను మన యువ ఇంజనీర్లు ఎంతోమంది రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రోన్ సాయంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను రైతులు తీసుకువస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న ఏర్పడిన విపత్తులో ఆహారం, మెడిసిన్స్ ఒక చోట నుండి మరో చోటికి చేర వేయడానికి ఈ డ్రోన్లు ఎంతో సహాయపడ్డాయి.

ఇప్పుడు అదే పరిజ్ఞానంతో గాల్లోకి ఎగిరే బుల్లి డ్రోన్ కార్ మనుషుల ప్రయాణానికి వాడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మన గుంటూరు వాసికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన అభిరామ్ అమెరికాలో రోబోటిక్స్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు.

ఈయన మనం ఇప్పుడు వాడుతున్న డ్రోన్లపై ఎన్నో ప్రయోగాలు చేసి మనుషులు డ్రోన్ సాయంతో గాల్లోకి ఎగిరే విధంగా డ్రోన్ ఎందుకు తయారు చేయకూడదు అన్న ఆలోచన వచ్చిందని, ఈ నేపథ్యంలోనే స్మాల్ సైజ్ లో ఉండే ఒక డ్రోన్ తయారుచేసి ఇద్దరు కూర్చునే విధంగా డిజైన్ చేసి రెడీ చేశాడు. ప్రస్తుతం మనము ఇప్పుడు ఉపయోగించే డ్రోన్ మాదిరే ఈ డ్రోన్ కారును కూడా వాడొచ్చని యువ ఇంజనీర్ ఆయన మాటల్లో చెబుతున్నాడు.

రెండు సీట్ల కెపాసిటీతో బుల్లి డ్రోన్ కారు..!

ఈ డ్రోన్ కారులో ఇద్దరు కూర్చోవడానికి రెండు సీట్ల కెపాసిటీతో దీనిని రూపొందించామని, ” వీ2 ” అని నామకరణం కూడా చేశానని ఆయన చెప్పారు. ఇది 100 kmph తో 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ను వెయ్యి అడుగుల పైన ఎత్తులో ప్రయాణం చేయగలమని చెప్పారు. ప్రస్తుతం దీనిపై ప్రయోగాలు చేస్తున్నామని, ప్రభుత్వం నుండి అనుమతులు రావాల్సి ఉందని ఆయన అంటున్నారు. ట్రైనింగ్ ట్రయల్ దశలో ఉన్న ఈ బుల్లి డ్రోన్ కారు సక్సెస్ అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డుపై ప్రయాణించే టాక్సీవాలా టైపు గాల్లో ఎగిరే డ్రోన్ కార్ టాక్సీలు అందుబాటులో రావడానికి మరెంతో దూరం లేదని ఆయన అంటున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఎంచక్కా ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా గాల్లో ప్రయాణం చేసి మనం గమ్యాన్ని చేరుకోవచ్చు. గమనిక ఇది మనకు ప్రాథమికంగా వచ్చిన సమాచారం మాత్రమే గమనించగలరు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now