Electricity Bill: ఎండాకాలంలో ఏసీ వాడుతున్నారా..! కరెంట్ బిల్ ఆదా చేయాలా.. ఈ చిట్కా మీకోసం

Electricity Bill
Electricity Bill

Electricity Bill: ఈ వేసవికాలంలో ఎవరింట్లో చూసినా ఏసి వాడకం పెరగడంతో విద్యుత్ బిల్లులు కూడా పెరుగుతున్నాయి. అయితే ఏ సీను రిమోట్ తో ఆఫ్ చేసినప్పుడు స్టెబిలైజర్ స్విచ్ ను కూడా ఆఫ్ చేయాలి. వారానికి ఒకసారి ఏసీ ఫిల్టర్ లను శుభ్రపరుస్తూ ఉండాలి. వేసవికాలం రానే వచ్చేసింది. అప్పుడే ఎక్కడ చూసినా కూడా ఉక్క పోత మొదలైంది. ఈ ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలు, కూలర్లు కొనుగోలు చేయడం జనాలు ప్రారంభించారు. ఎండాకాలంలో ఏ సీను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా గదిలో ఏసి వేసుకొని ఉపశమనం పొందుతారు. అయితే ఏసీ ఎక్కువగా వాడడం వలన విద్యుత్ బిల్లులు కూడా భారీగా వస్తాయి అన్న సంగతి మనకు తెలిసిందే.

డబ్బులు బాగా ఉన్నవాళ్లు ఏసి వాడినా కూడా వాళ్లకు బిల్లు ఎక్కువ వచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అందరూ అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఎండవేడికి తట్టుకోలేక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఏసి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో అయితే ప్రతి ఇంట్లో కూడా ఏసి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏసీ వినియోగదారులకు అతిపెద్ద సవాలు ఏంటంటే విద్యుత్ బిల్లు ఎక్కువ రావడం. ఈ వేసవికాలంలో నెలవారి విద్యుత్ బిల్లు చాలామంది కుటుంబాలకు భారంగా అవుతుంది.

ఈ మండే వేసవిలో ఏసీలో ఎక్కువసేపు వాడటం వలన విద్యుత్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. ఈ క్రమంలో అనేక కుటుంబాలకు విద్యుత్ బిల్లులు పెద్ద సవాలుగా మారుతున్నాయి. అయితే ఏసీ వాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ వహిస్తే ఏసి వాడిన తర్వాత కూడా విద్యుత్ బిల్లును వీలైనంతవరకు తగ్గించుకోవచ్చు. అయితే చాలామంది ఏసీ రిమోట్ ను ఆఫ్ చేసి వదిలేస్తారు. మరి కొంతమంది ఏసీ రిమోట్ లో టైమర్ను అమర్చి ప్రశాంతంగా నిద్రపోతారు. కొంత సమయం తర్వాత రిమోట్ స్వయం చాలకంగా ఏసీ ని ఆపేస్తుంది. అయితే విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలంటే ఏసీ ఆఫ్ చేస్తున్నప్పుడు స్టెబిలైజర్స్ ఇచ్చిన కూడా ఆఫ్ చేయాలి. ఏసి రిమోట్ కంట్రోల్ తో ఆఫ్ చేసిన ప్రతిసారి స్టెబిలైజర్ స్విచ్ కూడా ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వలన వీలైనంతవరకు కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now