TGSRTC: తొలిసారిగా కండక్టర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో డ్రైవర్ మరియు కండక్టర్ పోస్టులకు కావలసిన అర్హతలను కూడా తెలియజేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం రీజియన్లలో ఉన్న అన్ని డిపోలలో కండక్టర్లు మరియు డ్రైవర్ల పోస్టుల కోసం ఆర్టీసీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆర్టీసీ యాజమాన్యం ఈ పోస్టులను మెసర్స్ అక్షయ ఎంటర్ప్రైజెస్ సంస్థకు ఔట్ ఫోర్సింగ్ కు ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ పోస్టులకు ఆసక్తి కలిగిన వారు 8142463831,9885339228 నెంబర్లకు సంప్రదించాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. కండక్టర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
వీళ్లు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, ఎస్ఎస్సి మెమో జత చేయాల్సి ఉంటుంది. కండక్టర్ పోస్టులకు జీతం 18000 ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఆర్టీసీ డ్రైవర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నా వాళ్ళు హెవీ లైసెన్స్ తో పాటు ట్రాన్స్పోర్ట్ బ్యాడ్జి నెంబర్ తో పాటు కనీసం 18 నెలలు డ్రైవింగ్లో అనుభవం కలిగి ఉండాలి.
వీళ్లు కూడా దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, ఎస్ఎస్సి మెమో, డ్రైవర్ పోస్ట్ కోసం హెవీ లైసెన్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ బ్యాడ్జి నెంబర్, అనుభవం, ఆడియో క్లియరెన్స్ లెటర్స్ వంటివి జత చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ల ఉద్యోగానికి జీతం రూ.22,500 ఉంటుంది. కానీ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఔట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ మరియు డ్రైవర్ పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.