Todays Gold Rate: నేడు బుధవారం ఏప్రిల్ 30, 2025న అక్షయ తృతీయ జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షం మూడవ రోజున అక్షయ తృతీయ ను సెలబ్రేట్ చేసుకుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే చాలా మంచిదని చాలామంది నమ్మకం. ఈ క్రమంలో చాలామంది బంగారు నాణేల నుంచి బంగారు ఆభరణాల వరకు తమ స్థోమతకు మించి ఏదైనా ఒకటి కొనుగోలు చేస్తారు. ఈరోజు ఏప్రిల్ 30 అక్షయ తృతీయ రోజున బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
గత కొన్ని రోజుల క్రితం 24 క్యారెట్ల తులం పసిడి ధర లక్షకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు బంగారం ధర రూ.97,980 గా ఉంది. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా 10 గ్రాములకు బంగారం ధర రూ.3000 తగ్గినట్లు తెలుస్తుంది. బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా తగ్గాయి. ఈరోజు మల్టీకమోడిటీ మార్కెట్లో బంగారం ధరలు 615లు తగ్గాయి.
ఎంసీఎక్స్ లో నేడు 10 గ్రాముల పసిడి ధర రూ.95,410 గా ఉంది. నేడు గరిష్ట ధర రూ.95,800 అలాగే కనిష్ట ధర రూ.95,031 గా ఉన్నాయి. మన దేశ బులియన్ మార్కెట్లో పసిడి ధరలో స్వల్పంగా పెరుగుదల ఉంది. ఈరోజు ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.96,100 ఉంది. అయితే నిన్న మంగళవారం రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,970 గా ఉంది. ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,810 గా ఉంది.
ఈరోజు కిలో వెండి ధర రూ.1,00,400 గా ఉంది. నిన్నటి కంటే ఈరోజు కిలో వెండిపై 100 రూపాయలు తగ్గినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ నగరంలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,810, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,980 గా ఉన్నాయి. అలాగే విజయవాడ మరియు విశాఖపట్నం నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,810, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,980. ఇక ఢిల్లీ నగరంలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,960, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.98,130 గా ఉన్నాయి.