Gold Silver Prices: పరుగులు పెడుతున్న పసిడికి బ్రేక్.. పసిడి, వెండి ధరలు ప్రస్తుతం ఇలా..
గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఎవరు కూడా కనివిని ఎరుగని రీతిలో ధరలు పెరుగుతూ వెళ్తున్నాయి. పసిడి అంతర్జాతీయ మార్కెట్లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. అయితే వాస్తవానికి బులియన్ మార్కెట్లో పసిడి మరియు వెండికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కనివిని ఎరుగని రీతిలో గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి కొత్త రికార్డులను సృష్టిస్తుంది. అయితే కొన్నిసార్లు పసిడి ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. ఇటీవల కాలంలో 24 క్యారెట్ల బంగారం ధర 90 వేలకు చేరువైంది. అలాగే వెండి ఏకంగా లక్ష మార్కులు దాటి పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో తాజాగా పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. 17 మార్చి 2025 సోమవారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 82,190 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,660 గా ఉంది. కిలో వెండి ధర రూ. 1,02,900 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం ధరలు ఇలా ఉన్నాయి…
హైదరాబాదు నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,190, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,660 గా ఉంది.
విశాఖపట్నం మరియు విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,190, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,660 గా ఉన్నాయి.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 82,340, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,810 గా ఉంది.
ముంబై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,190, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,810 గా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,190, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,660 గా ఉన్నాయి.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,190, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,660 గా ఉన్నాయి.
వెండి ధరలు ఇలా ఉన్నాయి…
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 1,11,900 గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి రూ.1,11,900 ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,02,900 ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.1,02,900 ఉంది.
బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,02,900 ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,11,900 గా ఉంది.
అయితే ఈ ధరలు 17 మార్చ్ 2025 ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు.