Warangal: వరంగల్, మార్చి 17 (ప్రజా శంఖారావం): సప్త సముద్రాలు దాటి, కన్న వారిని ఒప్పించి ప్రేమించిన అబ్బాయి తో వివాహ బంధంతో ఒకటైన అమెరికా అబ్బాయి.. వరంగల్ అమ్మాయి పెళ్లి సంగతులు.. దేశాలు వేరైనప్పటికీ తమ ప్రేమను గెలిపించుకునేందుకు వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన సుప్రియ – అమెరికాకు చెందిన గ్రాండ్‌ను బంధు, మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. జిల్లాలోని పలువురు ప్రజా ప్రతినిధులు ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా సుప్రియ అమెరికాలో గత కొన్ని ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ అక్కడే తనతో ఉద్యోగం చేస్తున్న అమెరికా అబ్బాయి గ్రాండ్ (స్నేహితుడు) ను ప్రేమించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంది.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now