JOBS: నిరుద్యోగులకు శుభవార్త.. ప్రత్యేక శిక్షణ అందించి ల్యాండ్ సర్వేయర్ గా ఉద్యోగం అందిస్తున్న ప్రభుత్వం

JOBS
JOBS

JOBS: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హుజురాబాద్ ఆర్డిఓ పరిధిలోని అన్ని మండలాలలో ఉన్న నిరుద్యోగ యువతీ మరియు యువకులకు ఒక మంచి శుభవార్త తెలిపింది. మండలంలో ఉన్న 10 ప్లస్ 2 లేదా డిగ్రీ పూర్తి చేసి 60 సంవత్సరాల లోపు ఉన్న నిరుద్యోగులకు ల్యాండ్ సర్వేయర్ గా ఉద్యోగం పొందేందుకు న్యాక్ ప్రత్యేక శిక్షణ అందిస్తుంది.

హుజురాబాద్ పాత డిగ్రీ కళాశాలలో ఈ శిక్షణ క్యాంపు 90 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ కూడా అందిస్తున్నారు. ఈ సర్టిఫికెట్ పొంది హైదరాబాద్ నగరంలో 42 రోజులు శిక్షణ తీసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ సర్వేయర్ లైసెన్స్ కూడా అందిస్తుంది.

ప్రభుత్వం అందించే ఈ లైసెన్సు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ క్యాంపులో శిక్షణ పొందడానికి అభ్యర్థులు ప్రభుత్వానికి రూ.14,700 చెల్లించాలి. ఈ సందర్భంగా న్యాక్ హుజురాబాద్, సైదాపూర్, జమ్మికుంట, శంకరపట్నం మరియు ఇల్లందకుంట మండలాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. మరిన్ని వివరాల కోసం మీరు హుజురాబాద్ పాత డిగ్రీ కళాశాల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ సెంటర్ క్యాంపులో సంప్రదించవచ్చు.7396988875,7989250779 ఫోన్ నెంబర్లకు కాల్ చేసి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now