MOBILE PHONES: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అయితే కొంతమంది తక్కువ ధరలో అన్ని రకాల ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం మార్కెట్లో గాలిస్తూ ఉంటారు. అన్ని రకాల ఫీచర్లు ఉండి కొంచెం తక్కువ ధరలో మార్కెట్లో బాగా క్రేజ్ ఉన్న స్మార్ట్ ఫోన్లో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో ఐక్యూ నియో 9 ప్రో, వన్ ప్లస్ 13R, సాంసంగ్ గాలక్సీ S24 FE, ఒప్పో Reno 13 5జి, హానర్ 200 ప్రో గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్లకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. వీటిలో అధిక ఫ్రెష్ రేట్ Amoled స్క్రీన్లు అలాగే బాగా రన్ అయ్యే ప్రాసెసర్లు, భారీ బ్యాటరీలు మరియు మంచి పర్ఫామెన్స్ కలిగి ఉంటాయి. గత ఏడాది ఫిబ్రవరి 22న ఐక్యూ నియో 9 ప్రో మార్కెట్లో రిలీజ్ అయింది.
ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.35,495 గా ఉంది. దీంట్లో 8gb ర్యామ్ మరియు 128gb స్టోరేజ్ ఉన్నాయి. ఏమోలేడ్ స్క్రిన్ దీనిలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 5160 ఎం ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఈ ఏడాది జనవరి 7న వన్ ప్లస్ 13 ఆర్ మార్కెట్లో విడుదల అయ్యింది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.39,999 గా ఉంది. దీంట్లో 12 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్లో 6000 ఎం ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 27న మార్కెట్లో సాంసంగ్ గెలాక్సీ s24 ఎఫ్ ఇ విడుదల అయ్యింది. ప్రస్తుతం దీని ధర మార్కెట్లో రు.34,999 గా ఉంది. దీంట్లో 8 జిబి ర్యామ్ మరియు 128gb స్టోరేజ్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లో 4700 ఎం ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. ఏడాది జనవరి 9న ఒప్పో రెన్నో 13 ఫైవ్ జి మార్కెట్లో రిలీజ్ అయింది.
ప్రస్తుతం దీని ధర రూ.37,999 గా ఉంది. 128 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు ఇది 8gb ర్యామ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 5600 ఎం ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. గత ఏడాది జులై 18న హానర్ 200 ప్రో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రిలీజ్ అయింది. దీని ధర ప్రస్తుతం రూ.35,998 గా ఉంది. దీంట్లో 12 జిబి మరియు 512gb వేరియంట్ లో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 5200 ఎం ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. అలాగే గూగుల్ పిక్సెల్ 8a గత ఏడాది మే 7న మార్కెట్లో రిలీజ్ అయింది. దీని ధర ప్రస్తుతం రూ.37,999 గా ఉంది. ఇది 8gb ర్యామ్ మరియు 128gb స్టోరేజ్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లో 4492 ఎం ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.