Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిరుద్యోగ యువతకు ఒక శుభవార్తను తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలు ఊపొందుకున్నాయి. ఒకదాని వెనుక మరొకటి నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే దిశగా ప్రభుత్వం రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఈ నెల చివరిలో రెండు కీలక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
ఎప్పటినుంచో తెలంగాణ నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రక్రియలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకొని గత ఏడాది నుంచి నిలిచిపోయిన ప్రభుత్వ నోటిఫికేషన్లు ప్రస్తుతం ఒకదాని వెనుక ఒకటి త్వరలో వెలువడనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రీ షెడ్యూల్ చేసేందుకు రెడీ అవుతుంది. దీనికోసం ముఖ్యమంత్రిగా సహా మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తుంది అంటూ సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను భారీ ఎత్తులో ఉద్యోగాల భర్తీకి ముందుగానే ప్రణాళికను రూపొందించుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం 20 నోటిఫికేషన్ లను జారీ చేసి విభిన్న శాఖలో నియమాకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కొత్త నోటిఫికేషన్లను నిలిపివేయడం జరిగింది.
ఈ క్రమంలో సెప్టెంబర్ 2024 నుంచి నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టత రావడంతో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం కేంద్రంగా చేసుకొని రోస్టర్ ను ఫిక్స్ చేసి మళ్లీ నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. గడిచిన ఏడాదిలో వివిధ శాఖలలో ఉద్యోగాలు రిటైర్ కావడంతో ఖాళీలు మరిన్ని పెరిగాయి.
పెరిగిన ఖాళీలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్ను రూపొందించబోతోంది. ఈ నెల చివరిలో మొదటి విడతగా రెండు పెద్ద నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశం ఉంది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడి ఉద్యోగాలు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో 4 వేలకు పైగా పోస్టుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని అనుకుంటుంది.