Good News STUDENTS: విద్యార్థులకు గొప్ప శుభవార్త.. ఇలా చేస్తే చాలు ఎకౌంట్లోకి వేల రూపాయలు..!

Good News For Students
Good News For Students

Good News STUDENTS: ప్రజా శంఖారావం డేస్క్ ఆగస్టు 11: విద్యార్థులకు గొప్ప గుడ్ న్యూస్.. కేవలం మీరు ఇప్పుడు ఇలా చేస్తే చాలు. మీ ఎకౌంట్లోకి 36వేలు వచ్చి చేరుతాయి. అది ఏంటని అనుకుంటున్నారా? అయితే అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.!

ముందుగా దీనికోసం మనం ఏం చేయాలి? మనకు డబ్బులు ఎలా వస్తాయి? అని అనుకుంటున్నారు కదా..! మీరు ఇలా చేస్తే ఉచితంగానే డబ్బులు పొందవచ్చు! అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..! కానీ మీరు ఇక్కడే ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి.

ఈ అవకాశం కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మాత్రమే. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.

ముఖ్యమైన విషయాన్ని గమనించాలి:

ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఒక ఫౌండేషన్ కొన్ని పోటీలను నిర్వహిస్తున్నారు. ఆ ఫౌండేషన్ వారధి ఫౌండేషన్.

అయితే అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ పోటీలను నిర్వహించాలని విద్యాశాఖ సంచాలకులు నరసింహ రెడ్డి ఆయా జిల్లాలలోని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులను జారీ చేశారు. దీనివల్ల విద్యార్థులకు చాలావరకు ఉపయోగం కలుగుతుంది.

ప్రతిభ కలిగిన విద్యార్థులు ఈనెల 12న నిర్వహించే మండల స్థాయి పోటీలకు వారిని పంపాలని సూచించారు. ఈ పోటీల్లో 8 నుంచి 10వ తరగతి చదువుకునే విద్యార్థులు మాత్రమే ఉపన్యాస, వ్యాసరచన పోటీలను నిర్వహించాలని వారు ఆదేశించారు. అయితే ఆన్లైన్లో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించవచ్చని నిర్ణయించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఉన్నత పాఠశాలలో విజేతలను ఎంపిక చేసి మండల స్థాయికి పంపేందుకు ఏర్పాటు కూడా చేస్తున్నారు. కాగా విద్యార్థులకు ఆంగ్లంలోని పోటీలు నిర్వహించాలని షరతు విధించారు.

అయితే గ్రూపులుగా విద్యార్థులు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఒక్కో గ్రూపులో రెండు నుండి ముగ్గురు విద్యార్థులకు అనుమతినిచ్చారు. ఒక్కో మండలం నుంచి జిల్లాకు రెండు గ్రూపులను పంపాలి. జిల్లా స్థాయిలో ఒక్కో అంశం నుంచి ఒక్కో గ్రూపును రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు.

ఒక్కో అంశంలో నిర్వహించే పోటీకి 100 మార్కులు కేటాయించారు. రాష్ట్రస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో గెలిచిన వారికి బహుమతులను అందజేస్తారు.

బహుమతుల ప్రదానం:

ఒక్కో అంశంలో మొదటి బహుమతి 36వేలు కాగా ద్వితీయ బహుమతి 30వేలు, తృతీయ బహుమతి 27వేలు గా ప్రకటించారు. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి మేధస్సుకు పదును బెట్టి పోటీల్లో పాల్గొని సులభంగా 36 వేల రూపాయలు పొందే అవకాశం ఉంది.

ఈనెల 12న మండల స్థాయిలో పోటీలను నిర్వహించనున్నారు. 26న జిల్లాస్థాయి పోటీలు, 31న రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయి.

సెప్టెంబరు 19న ఆన్లైన్లో రాష్ట్రస్థాయి వ్యాసరచన, 21న ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 28న ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలను వారి వివరాలను ప్రకటిస్తారు.

ఖాతాల్లోకి నగదు డిపాజిట్:

అక్టోబర్ 12న నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి గెలుచుకున్న నగదు డబ్బును డిపాజిట్ చేసి వారి అడ్రస్ కు పోస్టు ద్వారా ప్రశంస పత్రాలను అందజేస్తారు.

కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు మిస్ కాకుండా వినియోగించుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now