TOLL PLAZA: ప్రజా శంఖారావం డేస్క్ ఆగస్టు 11: వాహనదారులకు ఒక గొప్ప శుభవార్త. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఇకపై టోల్ ఫీజు ఉండదు. టోల్ గేట్స్ వద్ద నూతన వినూత్న విప్లవం తీసుకురానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు టోల్ ప్లాజా వద్ద వసూలు చేసిన ఫీజు తీరు విధానం ఇక ఉండదు. ఆ విధానానికి స్వస్తి చెప్పనున్నారు. కొత్త నిర్ణయానికి శ్రీకారం చుడుతున్నారు.
ఒక కొత్త టెక్నాలజీ..
టోల్ ప్లాజా విషయంలో వాహనదారులకు ఒక కొత్త టెక్నాలజీ పరిచయం కానుంది. ఇప్పటివరకు వాహనదారుల వద్ద వసూలు చేసిన టోల్ ప్లాజా కు కాలం చెల్లింది. ఆధునిక యుగంలో ప్రతినిత్యం అభివృద్ధి చెందడంతో పాటు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు.
ఈ దశలోనే శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానానికి శ్రీకారం చుట్టబోతుంది ప్రభుత్వం. ఇక జీపీఎస్ ద్వారా టోల్ విధానం అమల్లోకి రానుంది. దీంతో వాహనం ప్రయాణించిన దూరానికే వాహనదారులు టోల్ రుసుము చెల్లించవలసి ఉంటుంది. దీంతో వాహనదారులకు చాలా డబ్బు ఆదా అవుతుంది.
త్వరలోనే వాహనదారులకు..
ఈ విధానం అమలు అయితే త్వరలోనే వాహనదారుల జేబుకు చిల్లు పడడం తగ్గిపోతుంది. అంతేకాదు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ కూడా నియంత్రించడానికి ఈ నూతన విప్లవాత్మక విధానం దోహదపడుతుందని భావిస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.