Home బిజినెస్ New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ ఇచ్చిన ప్రభుత్వం.. అర్హులైన వారికి...

New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ ఇచ్చిన ప్రభుత్వం.. అర్హులైన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది

New Ration Cards
New Ration Cards

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు లబ్ధిదారుల ఎంపిక రాష్ట్రంలో చివరి దశకు చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 16 నెలల నుంచి రాష్ట్ర ప్రజలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఎంపిక మరియు కార్డుల జారీ ప్రక్రియ పూర్తవుతుందని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజలకు పోరాట కలిగించింది. దీని గురించి మాట్లాడిన మంత్రి రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉన్న వాళ్ళందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం పథకం అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ఈ పథకానికి మీసేవ కేంద్రాల్లో దాదాపు18 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణన సర్వేలో రేషన్ కార్డులు లేని వారి వివరాలను కూడా తెలిపారు. ఇప్పటివరకు కేవలం 1.26 లక్షల లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసినట్లు సమాచారం. కొన్ని లక్షల దరఖాస్తులు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ఆమోదించిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందలేదు.

కానీ ఆ లబ్ధిదారుల పేర్లు జాబితాలో ఉన్నా కూడా వాళ్లకు సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే కొత్త రేషన్ కార్డుల ముద్రణ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. పౌరసరఫరాల శాఖ పివిసి క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం మార్చి 11న టెండర్లను పిలిచింది. మార్చి 25 వరకు టెండర్లను స్వీకరించింది అయితే ముద్రణ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా స్పష్టత లేదు. అయితే రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయ్యేవరకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఇంకా 10 లక్షల దరఖాస్తులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. వీటిలో 50 నుంచి 55 శాతం మాత్రమే ఎంపిక చేస్తారని కూడా అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now