Business Idea: మహిళా ఐడియా సూపర్.. ఒక్క ఐడియాతో నెలకు రూ.60 వేలు సంపాదన

Business Idea
Business Idea

Business Idea: చాలామంది ఈ వేసవి కాలంలో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తున్నారు. ఒక మహిళ కూడా ఈ వేసవి కాలంలో తన బిజినెస్ ఐడియా తో నెలకు రూ.60 వేలు సంపాదిస్తుంది. ఈ వ్యాపారంతో మహిళ మంచి ఆదాయం పొందుతుంది. ఈమె సోడా బండి ద్వారా మంచి రాబడిని పొందుతుంది. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ ఉండడంతో సోడా బండి వాళ్ళకి మంచి గిరాకీ ఏర్పడుతుంది. ఒక మహిళ యాక్సిడెంట్ లో తన భర్త కాలు మరియు తన చేయి విరగడంతో గత ఐదు ఏళ్ల నుంచి సోడా బండి నడుపుతూ నెలకు 60 వేల రూపాయలు సీజన్లో అలాగే అన్ సీజన్లో 500 రూపాయలు రోజుకు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.

ఈ విషయాన్ని ఆ మహిళ లోకల్ 18 న్యూస్ ఛానల్ తో పంచుకుంది. రోజురోజుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు వడదెబ్బ డిహైడ్రేషన్ లాంటి సమస్యల బారిన పడకుండా చూసుకోవాలి. అవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటికి వెళ్ళకూడదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో జ్యూస్ బండ్లు, సోడా బండ్లు వాళ్లకి గిరాకీ పెరుగుతుంది. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మండలం పరిధిలో బొప్పారం గ్రామం కు చెందిన లక్ష్మీ అనే ఒక మహిళ గత 5 ఏళ్ల నుంచి నకిరేకల్ పట్టణంలోని ట్రెండ్ షాపింగ్ మాల్ పక్కన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి ఎదురుగా సోడా బండి నడుపుతూ నెలకు 60 వేల రూపాయలు సీజన్లో సంపాదిస్తుంది. ఇక సీజన్ లేని సమయంలో రోజుకు 500 రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు అలాగే ప్రతిరోజు ఉదయం ఆమె ఆ ప్రాంతంలో 10:00 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటానని లోకల్ 18 తో చెప్పుకొచ్చింది. ప్రతిరోజు దాదాపుగా 200 మంది సోడా కస్టమర్లు అక్కడికి వస్తారని తెలిపింది. తన దగ్గర మాత్రం ఒక గ్లాసుకి ₹10 రేటు ఉన్నట్లు తెలిపింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now