Home ఆధ్యాత్మికం Vastu Tips: మీరు సంపాదించిన డబ్బు నిలకడగా ఉండాలంటే.. ఇంట్లో ఈ చిన్న చిన్న వాస్తు...

Vastu Tips: మీరు సంపాదించిన డబ్బు నిలకడగా ఉండాలంటే.. ఇంట్లో ఈ చిన్న చిన్న వాస్తు టిప్స్ ఫాలో అవ్వండి

Vastu Tips
Vastu Tips

Vastu Tips: మనం ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించిన డబ్బులు మనకు తెలియకుండానే అనవసరంగా కొన్ని కొన్ని సార్లు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అయితే దీనికి కారణం వాస్తు లోపం కూడా అయి ఉండొచ్చు అని నిపుణులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని తప్పుల కారణంగా ఆ ఇంట్లో డబ్బు నిలువ ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశ కుబేరుడికి సంబంధించినదిగా చెప్తారు కాబట్టి ఆ దిశలో అల్మారా పెట్టుకోవడం చాలా శుభప్రదం. అయితే అల్మారా లో డబ్బులను కింద కాకుండా పై భాగంలో పెట్టాలి.

సంపద ఆధారంలో ఇది బాగా సహాయపడుతుంది. ఇంట్లో మహాలక్ష్మి యంత్రం లేదా ధనవృద్ది యంత్రం పెట్టుకోవాలి. ఇది సంపదను ఆకర్షిస్తుంది. పూజ గదిలో లక్ష్మీదేవి లేదా కుబేరుడి విగ్రహాలను పెట్టి పూజించాలి. దీనివలన కూడా ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. రాత్రి సమయంలో వంట గదిలో ఉన్న మురికి పాత్రలను శుభ్రం చేయాలి. మురికి పాత్రలు రాత్రంతా వంటగదిలోనే ఉంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించినట్టు. రాత్రి నిద్రపోయే ముందు షింక్ లో ఉన్న పాత్రలను కడిగి పడుకోవడం వలన ఆ ఇంట్లో సంపద పెరుగుతుంది.

మురికిగా ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు. కాబట్టి ప్రతిరోజు ఇంటిని చాలా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈశాన్య దిశలో చెత్త ఉండకుండా చూసుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉండడం వలన ఆ ఇంట్లో సంపాద మరియు సానుకూల శక్తి పెరుగుతుంది. పూజ గదిలో వాస్తు శాస్త్రం ప్రకారం గడియారపు శంఖాన్ని పెట్టుకోవడం వలన అది ఆర్థికపరమైన సమస్యలను తొలగిస్తుంది. పూజ గదిలో ఎండిపోయిన లేదా పాత పువ్వులు ఉండకుండా చూసుకోవాలి. ఈ చిన్న చిన్న పొరపాట్లు కూడా లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి ఎండిన పూలను వెంటనే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now