MANGO FRUIT: అన్ని పండ్లలో మామిడిని రారాజు అని అంటారు. మామిడిపండు ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. అందరూ కూడా మామిడిపండును చాలా ఇష్టంగా తింటారు. వేసవికాలంలో మామిడి పండ్ల కోసం చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. మన దేశవ్యాప్తంగా ఆమపన్న నుంచి ఆమ్ రస్ వరకు ఈ మామిడి సీజన్లో చాలా రకాల వంటకాలు ఉన్నాయి. మన దేశం లో వెయ్యికి పైగా మామిడి పండ్లు ఉత్పత్తి అవుతాయి. మామిడిపండ్ల లో ఉండే కొన్ని రకాలకు మార్కెట్లో భారీ ధరలు కూడా పలుకుతాయి. కొన్ని ప్రత్యేక రకం మామిడిపండు కిలో ధర లక్షల్లో ఉంటుంది.
మార్కెట్లో ఒక కిలో మామిడి పండ్ల ధర 100 నుంచి 200 రూపాయలకు మధ్యలో ఉంటుంది. కానీ ఒక జాతి రకం మామిడిపండ్ల ధర మాత్రం మార్కెట్లో కిలో మూడు లక్షలు ఉంటుంది. ఈ మామిడిపండు రూబీ ఎరుపు రంగు, మృదువైన ఆకృతి మరియు చాలా తీపి కలిగి ఉంటుంది. జపాన్ కు చెందిన ఈ మామిడి పండ్లు చాలా ఖరీదైనవి. కానీ ఈ మధ్య కాలంలో మన దేశంలో కాశ్మీర్ మరియు బీహార్లలో కూడా ఈ రకం మామిడి పండ్లను పండిస్తున్నారు. మియాజ మామిడి పండ్లు ప్రపంచంలో అత్యంత ఖరీదైన మామిడిపండుగా ప్రసిద్ధి చెందాయి. వీటి ధర కిలో మూడు లక్షల రూపాయలు ఉంటుంది. ఈ పండును పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఒక హోదాకి చిహ్నంగా ఈ పండు మారింది.