Free Treatment: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యువజన కింద 70 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక ఆరోగ్య భీమాను అందిస్తుంది. 70 ఏళ్లు పైబడిన వృద్ధులు ఆయుష్మాన్ వేవందన కార్డు ద్వారా వాళ్లకు అవసరం అయినా ఆరోగ్యపరమైన సేవలను ఉచితంగా పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వాళ్లందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ వేవందన కార్డు కింద 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలకు అర్హులు అవుతారు.
ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రిలో ఐదు లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఈ కార్డు పొందిన అర్హులైన వాళ్లందరికీ కూడా ఈ పథకం కింద మెడికల్ పరీక్షలు, మందులు, సర్జరీలు, ఐ సి యు అన్నీ కలిపి 27 స్పెషాలిటీలో, 1,961 మెడికల్ ప్రొసీజర్స్ అందిస్తున్నారు.
అయితే ఈ కార్డు పొందడానికి సంపాదనతో సంబంధం ఉండదు. ఇప్పటికే రిటైర్ అయి ఉన్న లేదా జాబ్ చేస్తున్న వారైనా, స్థిరమైన ఆదాయం లేని వాళ్ళు అందరూ కూడా ఈ పథకం కింద ఐదు లక్షలు ఉచితంగా చికిత్స ప్రయోజనం పొందవచ్చు. ఈ కార్డు పొందడం ద్వారా సీనియర్ సిటిజెన్ల కు అవసరమైన ఆరోగ్యపరమైన ఖర్చులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళందరూ కూడా ఈ కార్డుకు అర్హులు.
ఈ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ లో ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. లబ్ధిదారుడిగా మీరు అందులో లాగిన్ అవ్వాలి. మొబైల్ నెంబరు, క్యాప్చ, అతంటికేషన్ మెథడ్ వంటి పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి. ఆ వ్యక్తి యొక్క రాష్ట్రం మరియు ఆధార్ కార్డు వివరాలను ఇవ్వాలి. ఓటీపీ తో ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాత వ్యక్తిగత వివరాలను పూర్తి చేసి డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి. మొబైల్ నెంబర్ ఓటిపిని ఎంటర్ చేసి క్యాటగిరి పిన్కోడ్ వంటి వివరాలను పూర్తి చేయాలి. పూర్తి వివరాలు వెరిఫై అయిన తర్వాత మీరు ఆయుష్మాన్ యాప్ ద్వారా ఆయుష్మాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.