Vastu Tips: కొంతమంది డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటారు. కానీ వాళ్లు ఎంత సంపాదించినా కూడా ఒక్క రూపాయి కూడా ఇంట్లో నిలవదు. చేతికి ఎంత డబ్బు వచ్చినా కూడా అది ఇట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. దీంతో చేతిలో డబ్బు నిలవడం లేదు అని చాలామంది బాధపడతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలను పాటిస్తే ఇంట్లో సంపద నిలుస్తుంది. ఇల్లు శుభ్రంగా మరియు అందంగా మెరిసిపోతున్న సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అందరి నమ్మకం. మీరు కొంత సమయాన్ని ప్రతిరోజు మీ ఇంటికి కేటాయించి ఇంటిని పూల మొక్కలు, తోరణాలతో డెకరేట్ చేసి అందంగా, శుభ్రంగా ఇంటిని పెట్టుకోవడం వలన ఆ ఇంట్లో డబ్బు నిలుస్తుంది.
పనికిరాని వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు. వీటిని పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. పగిలిన ఫోటో ఫ్రేమ్స్, పగిలిన వస్తువులు, పాడైపోయిన వస్తువులను బయట పడేయాలి. వీటిని పడేయడం వలన కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. చెప్పులను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వదలకూడదు. దీనివలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.
ఇంట్లో ఆనందం, శ్రేయస్సు అలాగే ఐశ్వర్యం కలగాలంటే తులసి మొక్క చుట్టూ ప్రతి రోజు కూడా నెయ్యి దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో ఉన్న ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా మరియు అందంగా పెట్టుకోవడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని వాస్తు శాస్త్రా నిపుణులు చెప్తున్నారు.